Header Banner

దిశా యాప్‌ చట్టబద్ధమేనా? చట్టం పేరుతో వైసీపీ మోసం! హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!

  Tue Mar 04, 2025 14:58        Politics

ఏపీ శాసనమండలి (AP Legislative Council)లో దిశా చట్టం (Disha Act), దిశా యాప్‌ (Disha App)పై అధికార... ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) మాట్లాడుతూ.. గత (వైసీపీ ప్రభుత్వం హాయాంలో) ఐదు సంవత్సరాల్లో దిశా యాప్‌ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లో ఎక్కించారని.. దిశా చట్టమంటూ... చట్టబద్ధతలేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. దిశా యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోం మంత్రి డిమాండ్ చేశారు.


ఇది కూడా చదవండినామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ!  పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!


అసలు దిశా చట్టానికి చట్టబద్ధత ఉందా.. లేదా.. అనేది విపక్ష సభ్యులు చెప్పాలన్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను అధికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది.. హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి, డ్రగ్స్‌ నిరోధించడానికి.. నిందితులపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారని.. ప్రత్యేకంగా ఒక ఈగల్ వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దానికి ప్రభుత్వం జీవోఎంఎస్ నెం. 145 ఇచ్చిందని, దీనికి బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. డీఐజీ లెవెల్ అధికారి ఆధ్వర్యంలో టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు.


ఇది కూడా చదవండిఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!


దిశా చట్టం ఉంది.. వైసీపీ..
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. దిశా యాప్ ద్వారా ఎన్ని కేసులు నమోదయ్యాయో ఒకసారి లెక్కలు చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్‌లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దిశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. దిశా యాప్ ఇప్పుడు ప్రభుత్వం వాడకపోతే... దాని స్థానంలో కొత్త యాప్‌ని తీసుకొస్తున్నారా అని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. వరుదు కళ్యాణి వ్యాఖ్యలకు సమాధానంగా... దిశా యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోం మంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నట్టు హోమ్ మంత్రి తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ycp #disaapp #todaynews #flashnews #latestnews